
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని కళ్యాణ వేడుక రోజైనా శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో 12 ప్రాంతాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలను భక్తుల నామస్మరణల మధ్య వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయ బద్ధంగా వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని శివ రామాలయం, అయ్యప్ప దేవాలయం, పాటిమీద ఆంజనేయస్వామి దేవాలయం, బుడగ జంగాలకాలనీ లో, విద్యానగర్లో, దమ్మక్కపేటలో, బోర్నపల్లిలో, కొత్తపల్లిలో, సిద్ధార్థ నగర్ లో, కేసీ క్యాంపు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో, ఇప్పల నర్సింగాపూర్ లో ఆలయ కమిటీలు భక్త సమాజాల వారు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలను వేద పండితుల సూచనల మేరకు భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణ విశేషాలను వేద పండితులు భక్తులకు సోదాహరణంగా వివరించారు. సీతారామచంద్రస్వామి కళ్యాణ విశేషాలను, ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. కళ్యాణo సందర్భంగా భక్తుల కోసం చలువ పందిర్లు, షామియానాలను వేశారు. మంచినీటి సౌకర్యం, మజ్జిగ బెల్లం పానకంలను భక్తులకు అందించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, వేద పండితులు చీకోటి రాహుల్, చెరుకుపల్లి శ్రీధర్ ఆచార్యులు, రామాచారి, నిఖిల్ శర్మ, తిరునగరి తిరుమలేష్, కుర్జి ప్రదీప్, పరాంకుశం చైతన్య, లలిత్ కుమార్, కమిటీ సభ్యులు బుర్ర ఆగయ్య, శ్రీహరి, భూసారపు బాపూరావు ఆకుల సదానందం శనిగరపు నరేందర్, క్యాస కమల్ కుమార్, బుర్ర నటరాజ, శ్రీనివాస్, మహాదేవ్, చైతన్య, అరుణ్ కుమార్, నాగరాజ్, అకినేపల్లి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.






పట్టణంలో పలు చోట్ల కళ్యాణ వేడుకల దృశ్యాలు





