
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని కెసి క్యాంపు వద్ద గల ఓ తోటలో శుక్రవారం మనిషి ని పోలిన తల ఉన్నట్లు ఉండే వింత పక్షి కనబడింది. కేసీ క్యాంపు కాకతీయ కెనాల్ బ్రిడ్జి పక్కన ఉన్న తోటలో ఈ పక్షి కనపడగా అక్కడ ఉన్న కోతులు దానిని తరమడంతో ముళ్ళపదలో చిక్కుకుంది. ముళ్ళ పొదలతో తీవ్రంగా గాయపడ్డ వింత పక్షిని చూసిన భాస్కర్ అనే వ్యక్తి సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ కు సమాచారం అందించగా వెంటనే ఆయన స్పందించి వింత పక్షిని చేరదీసి దానికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పశు వైద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి వద్దకు తీసుకొని వెళ్లి వైద్యం చేయించారు. అనంతరం ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వారు నలుపాల వేణుగోపాల్ నుండి వింత పక్షిని స్వాధీనం చేసుకొని కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలించారు. కాగా వింత పక్షిని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. సామాజిక కార్యకర్త వేణుగోపాల్ ఔధార్యాన్ని పలువురు అభినందించారు.


గాయపడ్డ వింత పక్షికి వైద్యం చేస్తున్న పశు వైద్యాధికారి..





