Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ఎల్కతుర్తి: ఇటీవల నూతనంగా ఎల్కతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన ఇ నరసింహరావుని మండలంలోని దండేపల్లి గ్రామ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షుడు కొంగ ప్రవీణ్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. విధినిర్వహణలో అంకితభావంతో వ్యవహరిస్తానని ఎస్సై పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని గ్రామాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్న నేరుగా తనను సంప్రదించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ప్రజల సహాయ సహకారాలతో మండలంను నేర రహిత మండలంగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.

ఎస్సైని శాలువాతో సత్కరిస్తున్న కొంగ ప్రవీణ్





