
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన రిమెడియల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి వి ఆంజనేయరావు కోరారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రిమెడియల్ తరగతులను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాబోయే ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కొన్ని కారణాల వలన ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేక పోయారు, అందుకు బాధపడకూడదని, నిరుత్సాహ పడకూడదన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా వారం రోజులు పట్టుదలతో చదివి ఉత్తీర్ణత సాధించాలని తద్వారా డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం పొందాలని అన్నారు. విద్యార్థులకు ప్రాధాన్యత కలిగిన ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు. తద్వారా కళాశాల అడ్మిషన్లు పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్, కళాశాల అధ్యాపకులు ప్రసాద్, మల్లారెడ్డి, విజయేందర్ రెడ్డి, మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


కళాశాలలో తరగతులను పరిశీలించి విద్యార్థులకు సూచనలు చేస్తున్న ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరావు…







