Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని పరకాల క్రాస్ రోడ్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరకాల క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన టేకుమట్ల రాజేష్, వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రబ్బాని, షేక్ ఫరూక్ అనే ముగ్గురు యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయిని హుజురాబాద్ ప్రాంతంలో అమ్మడానికి తీసుకు వస్తున్నారు. తనిఖీల్లో వారి వద్ద గంజాయి పట్టుబడింది.(ఫైల్ ఫోటో)

వీరి వద్ద నుంచి సుమారు 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం హుజురాబాద్ బస్టాండ్ లో టేకుమట్ల రాజేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ గంజాయి రాకెట్ గుట్టు రట్టు అయినట్లు తెలిసింది.





