
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యువత మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి సూచించారు.


మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని బస్టాండ్, దాని పరిధిలోని వివిధ హోటల్లు, పాన్ షాప్ లు, కూల్డ్రింక్ షాపులలో ఏసీపీ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… మత్తు పదార్థాలు వాడిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్టనానికి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బస్టాండ్లో నిరంతరం నిఘ పెట్టడం జరుగుతుందని ఎసిపి తెలిపారు. ఈ తనిఖీల్లో హుజురాబాద్ టౌన్ సిఐ టి.కరుణాకర్, పలువురు పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.








