
స్వర్ణోదయం ప్రతినిధి నిజామాబాద్: అసమాన ఆస్తుల (Disproportionate Assets) కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి సంబంధించిన 11 ప్రాంతాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో గుర్తించిన ఆస్తులు:
🔹 4 ఇళ్లు
🔹 1 వాణిజ్య భవనం (కమర్షియల్ బ్లాక్)
🔹 8 స్థలాలు (ప్లాట్లు)
🔹 10.23 ఎకరాల వ్యవసాయ భూమి
🔹 బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల నిల్వలు
🔹 ఇంకా తెరవాల్సి ఉన్న 3 బ్యాంకు లాకర్లు
ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ దీనికంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.





