
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరిగింది. విధి వంచన వల్ల భర్తను కోల్పోయిన మహిళలను సమాజంలో చిన్నచూపు చూడరాదని, వారి గౌరవాన్ని తగ్గించరాదని పలువురు కోరారు. మూఢాచారాలను రూపుమాపడానికి వితంతువుల పైన అపోహలను నిర్మూలించడానికి ఆడవాళ్లు కృషి చేయాలన్నారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు కాకూడదు అని, వితంతువులను దూరం పెట్టకూడదు అని, శుభకార్యాలలో పెళ్లిళ్లలో బతుకమ్మలలో వారికిని కూడా ప్రోత్సాహం ఇవ్వాలనీ, వాళ్లని కూడా సమాజంలో మనో ధైర్యంగా, గౌరవంగా జీవించేలా మనమంతా కృషి చేయాలని అతిధులు పేర్కొన్నారు. అలాగే పర్యావరణం దెబ్బతిన్నడానికి కారణం చెట్లు లేకపోవడం, అందుకోసం ప్రతి ఒక్కరూ ఇంటికొక చెట్టు పెట్టాలని సర్పంచ్ రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు, హుజురాబాద్ సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజేశ్వర్ రావు కార్యదర్శి సంపత్ , సభ్యులు బిక్షపతి, తునికి లక్ష్మి, మీరపల్లి వెంకట్రావు, విజయ్ కుమార్, నజీమా, హుజురాబాద్ ఏరియా కోఆర్డినేటర్స్ ఎండి ఖాజాబీ, రజిత, కళ్యాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హుజురాబాద్ సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్ లు

వితంతువుల పట్ల మర్యాదగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్న గ్రామ మహిళలు..




