
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న SFD ప్రాంత కో కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విచ్చల విడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి గౌతమ్, అరుణ్, సత్య, నగర ఉపాధ్యక్షులు సాయి తేజ, సిద్దు, రామ్ చరణ్, మారుతి. ప్రవీణ్, ఆయన్, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏబీవీపీ SFD ప్రాంత కో కన్వీనర్ అజయ్






