
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అప్పటినుండి ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి పనులు చేస్తూ మాట తప్పని మడమతిప్పని అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రఘునందన్ రావు నిలిచారని, తన శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో విశేష కృషి చేయడం అభినందనీయం అని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.


ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావును కలిసి వాణిజ్య పన్నుల శాఖలో చాలా సంవత్సరాలుగా కొత్త డివిజన్ లు, కొత్త సర్కిల్ మరియు అధికారుల, ఉద్యోగుల ప్రమోషన్ల గురించి ఎవరు పట్టించుకోలేదని కమిషనర్ ఎం రఘునందన్ రావు దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. వెంటనే ఎంతో చొరవ తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 15 డివిజన్లు ఉంటే ఇప్పుడు కొత్తగా నాలుగు డివిజన్ లు మంజూరు చేయించడం వలన ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 19 డివిజన్లో ఏర్పడినాయన్నారు. అలాగే ఎన్నో కొత్త సీటిఓ కార్యాలయాలు మంజూరు చేయించిన ఘనత రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకే ఆ ఘనత దక్కిందని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

గతంలో ఇలాంటి కమిషనర్ లేక ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి అన్నారు. ప్రతిసారి వెళ్లి అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు కుమార్ ప్రసాద్ ఐఏఎస్, డాక్టర్ టిడి కె శ్రీదేవి ఐఏఎస్ ఇలాంటి ఇంకో కొంతమంది అధికారులు ఉద్యోగుల సమస్యల గురించి కానీ అధికారుల ఉద్యోగుల ప్రమోషన్ల గురించి గానీ పట్టించుకోకపోవడంతో వాణిజ్య పన్నుల అధికారులు మరియు ఉద్యోగులు మానసికంగా కుమిలి పోయారన్నారు. అనుకోకుండా దేవుడు వరమిచ్చినట్టే వాణిజ్య పన్నుల శాఖకు పదవి బాధ్యతలు చేపట్టిన అప్పటినుండి ఇప్పటివరకు రఘునందన్ రావు రాత్రి పగలు వాణిజ్య పన్నుల శాఖలో ఉన్న సమస్యల మీద అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయం తెలుసుకొని ఒక సమస్య తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వచ్చి ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఘనత ఎం రఘునందన్ రావుకే ఆ పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఏ సమస్య అయినా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కొనియాడారు.


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావును సత్కరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్..
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వాటిని అమలుపరచటంలో ఎంతో కృషి చేస్తున్న యం రఘునందన్ రావు ప్రభుత్వం ఖజానాల లో జమ కావాల్సిన డబ్బులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించడంలో ఎంతో కృషి చేస్తున్న అధికారిగా రఘునందన్ రావుకి ఆ పేరు దక్కిందన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల వద్దకు వెళ్లడానికి కావలసిన డబ్బులను గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ద్వారా ఎన్నో పెద్ద ఇండస్ట్రీస్ వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన అన్ని రకాల బకాయిలను వసూలు చేయిస్తూ ప్రభుత్వ ఖజానాకు 30 తారీఖు లోపు జమ అయినట్లు తమ వంతు ఎంతో కృషి చేస్తున్న కమిషనర్ ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రతిసారి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సమావేశాలు జరిపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో 19 డివిజన్లకు సంబంధించిన జాయింట్ కమిషనర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మన డిపార్ట్మెంట్ కు మంచి పేరు రావాలంటే మనము కూడా ఎంత కష్టపడితే అంత మంచిదని అధికారులకు చెప్పుతూ వివిధ రకాల సలహాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రం అంతట నుండి తెలంగాణ రాష్ట్రం ఖజానాలో బడ్జెట్ జమ అయినట్లు చర్యలు చేపడుతున్న కమిషనర్ రఘునందన్ రావు ఇలాంటి అధికారి మా యొక్క వాణిజ్య పన్నుల శాఖకు రావటం మా వాణిజ్య పన్నుల అధికారుల మరియు ఉద్యోగుల అదృష్టమని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి వాణిజ్య పన్నుల శాఖలో అధికారులకు మరియు ఉద్యోగులకు ప్రమోషన్లు రాక ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న అలాంటి వారందరికీ ప్రమోషన్లు ఇచ్చిన ఘనత ఎం రఘునందన్ రావుకి పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. చాలా మంచిగా ఓపికతో ఉండి అన్ని విషయాలు ఉద్యోగ సంఘాలు అయిన దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ రావటములో మొట్టమొదటి డిపార్ట్మెంట్ జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ మరియు ఎక్సైజ్ శాఖ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రభుత్వ ఖజానాలో ముఖ్యమైన శాఖలు ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు జమ చేయించడంలో ఈ యొక్క నాలుగు డిపార్ట్మెంట్లు దీనిలో వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఎక్కువ రెవిన్యూ ప్రభుత్వ ఖజానాలో జమ చేయించడంలో ఎంతో చొరవ తీసుకుంటూ ఎప్పుడు కూడా చాలా బిజీ ఉంటూ ఎటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మరియు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖజానాల్లో వేయించడంలో ఎం రఘునందన్ రావు ఎంతో శ్రద్ధ వహిస్తారన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలలో హాజరై తనవంతు సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఎంతో కృషి చేస్తున్నది ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో మరియు ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే వరకు ఇలాంటి కమిషనర్ ను అధికారిగా కొనసాగించుకున్నట్లైతే చాలా బాగుంటుందనీ, ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు రావడానికి అవకాశం ఉందనీ అన్నారు. ఎంతో చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లో డబ్బులు జమ చేయించడంలో ఎంతో కృషి చేస్తున్న రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావుకి పదవి విరమణ ఇవ్వకుండా ఇలాగనే సర్వీస్ లో రఘునందన్ రావుని కొనసాగించుకుంటే ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు ఉంటుందనీ, ఒక్కరోజు ఒక్క నిమిషం ఒక గంట కూడా ఖాళీగా ఉండకుండా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు ఎలా తెప్పించాలి, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు జమ కావడానికి ఎలా చేయాలి అని ఆలోచనలతో ఎప్పటికీ చాలా బిజీగా ఉండే వ్యక్తి రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుండి ఏసిటిఓ నుండి డిసిటిఓ మరియు సిటిఓ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ సీటిఓ నుండి డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నుండి జాయింట్ కమిషనర్, మరియు అడిషనల్ కమిషనర్ ప్రమోషన్లు ఇచ్చిన ఘనత రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రఘునందన్ రావుకు ఆ పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
ఇలాంటి వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు ఈ శాఖలో ఇలాగనే రెండు సంవత్సరాలు కొనసాగితే వాణిజ్య పన్నుల శాఖలో ఎటువంటి సమస్యలు ఉండవు కనుక ఇలాంటి అధికారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఉద్యోగుల సమస్యలను తన సమస్యగా అనుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఎం రఘునందన్ రావు ఐఏఎస్ అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.





