Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: పెరుగుతున్న ధరలు, కార్పొరేట్ కంపెనీల పోటీ కారణంగా విశ్వకర్మల వృత్తి రక్షణ కోసం ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు సామూహిక బంద్ చేపడుతున్నట్లు విశ్వకర్మ మనుమయ సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు నందగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ….
బంద్ సందర్భంగా జూలై 18వ తేదీన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ నిర్ణయించిన నూతన ధరల పట్టికను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బంద్ ముగింపు రోజైన జూలై 20వ తేదీన విశ్వకర్మల సమస్యలపై శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. సంఘం నిర్ణయించిన ఈ బంద్కు విశ్వకర్మ సోదరులందరూ తప్పనిసరిగా సహకరించాలని, ఎవరైనా సంఘం నిర్ణయాన్ని ధిక్కరించి పనులు చేపడితే వారిపై సంఘం పరంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో విశ్వకర్మ మనుమయ సంఘం నాయకులు రావుల వేణు, రాంపల్లి బిక్షపతి, నాయకులు బాణాల వివేకానందచారి, పంచకోటి సత్యనారాయణ, ఎదులాపురం సదానందం, సజ్జనపు రవీందర్, చల్లూరి రమేష్, ఉప్పల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





