
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి వేడుకలు బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ….బడుగు బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే చత్రపతి సాహు మహారాజ్ నిర్ణయం మూలంగానే బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ల గురించి పొందుపరచడం జరిగిందని అన్నారు.
ఆయన కృషి వల్లనే బడుగు బలహీన వర్గాలకు అనేక ప్రయోజనాలు కలిగే అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, డాక్టర్ టి శేఖర్, బీసీ జేఏసీ నాయకులు చిలుకమారి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గజవెల్లి మధుసూదన్, మహిళా ప్రధాన కార్యదర్శి దేవసాని ప్రియదర్శిని, ఆడెపు సురేందర్, ఇప్పకాయల సాగర్, కొలిపాక క్రాంతి, మల్లేశం, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





