
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ విద్యా రంగoలో ఎంతోమంది పేద విద్యార్థులను ప్రయోజకులు చేశారని ఆయన సేవలు గొప్పవని హుజురాబాద్ ఆర్డిఓ జల కుమారి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఈ సభలో ఆమె మాట్లాడుతూ… ఆంజనేయరావు అధ్యాపకుడిగా ప్రిన్సిపాల్ గా ప్రభుత్వ విద్యారంగానికి ఎనలేని సేవ చేశారని, డిఐఓ గా పదవీ బాధ్యతలు సైతం మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయరావు దంపతులను విద్యార్థులు, అధ్యాపకులు, అతిథులు, పలువురు పాత్రికేయులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డిఐఈఓ సత్యవర్ధన్, సత్యనారాయణరెడ్డి, కనకయ్య, రాజేశ్వరరావు, కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసీదాస్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ సుగుణ, విజేందర్ రెడ్డి, మురళీమోహన్, వాసుదేవరావు, వనమాల, ప్రసాద్, బండి రాజశేఖర్, మల్లారెడ్డి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.





