Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు గొప్పవని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ ఉద్యోగి ప్రతాప సుధాకర్ -సరోజ దంపతులు పదవీ విరమణ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ప్రజలకు ఉపయోగపడే మున్సిపల్ కార్మికులను సన్మానించాలని ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ సరోజల గొప్పతనం అని అన్నారు. శ్రమ విలువను తెలుసుకున్న ఆ దంపతులు ప్రశంసనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్ ప్రతాప మంజుల, ప్రతాప తార, కో ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు రాజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, సూపర్ బజార్ రోడ్(ఇందిరా మార్గ్) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





