
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (ఎల్కతుర్తి) హనుమకొండ, ఆగస్టు 11: ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మతల్లి ఆలయ అభివృద్ధికి మంత్రి పొన్నం కృషి చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. గతంలో రూ. 50వేలు అందించగా మంగళవారం మరో రూ.50వేలను కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ముష్కె శ్రీనివాస్ ద్వారా ఆలయ పాలకవర్గానికి అందజేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కోసంఎస్డి ఎఫ్సీ నిధుల నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంబాల ఏర్పాటుకు ఒక లక్ష 35వేల రూపాయలను మంజూరు చేశారు వీటితోపాటు ఎండోమెంట్ కింద ఆలయ అభివృద్ధికి మరో 10 లక్షల రూపాయలను మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎల్లమ్మతల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పొన్నం అనుపు, శేఖర్, రాంగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిలుగుల గ్రామ సర్పంచ్ గణవేన సృజన రాజు,శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం అధ్యక్షులు పంజాల చే టారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాటర్ ప్లాంట్ అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ ఆరేపల్లి సమ్మయ్య, రమేష్, హనుమాన్ దేవస్థానం అధ్యక్షులు పెండ్యాల భాస్కర్, గ్రామ యూత్ అధ్యక్షులు పెద్దబోయిన కార్తీక్, వార్డు సభ్యులు ఆరెపల్లి చిరంజీవి, పెండ్యాల స్వామి, ఆరేపల్లి సమ్మయ్య, ఆలయ కమిటీ సభ్యులు పంజాల ఉప్పలయ్య,పంజాల స్వామి, పంజాల కనకయ్య, పంజాల రమేష్, పంజాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పెండ్యాల సామిల్, పెండ్యాల దేవదానం, ముస్కే సమ్మయ్య,గూటం శ్రీనివాస్ రెడ్డి, గుండేటి యాదగిరి, రాంపల్లి శ్రీనివాస్, పౌలు,ఆరెపల్లి కిరణ్, గుండాల మధు, మాటూరు శ్రీనివాస్, సోనీ, బాలమల్లు, హుస్సేన్, ఫాజల్, యువజన నాయకులు పంజాల అజయ్, పెండ్యాల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.





