
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉపాధ్యాయ వృత్తిలో హిందీ భాషా పండితునిగా 24 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు అందించి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేసి నేడు పదవి విరమణ పొందిన రుద్రారపు వెంకటస్వామిని మరియు వారికి అండగా నిలిచి నిరంతరం ప్రోత్సహించిన వారి సతీమణిని ఆయన మిత్రులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, సమాజంలో పేద వర్గాల ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆడేపు సురేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి మాడుగుల ఓదేలు, సీనియర్ అంబేద్కర్ వాదులు మేకల మల్లేష్, మొలుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





