Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉపాధ్యాయుడిగా తన పదవీకాలంలో పిల్లల బాగోగుల కోసం కృషిచేసిన టీచర్ రుద్రారపు వెంకటస్వామి ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని విశేష కన్వెన్షన్ హాల్లో పదవీ విరమణ పొందిన వెంకటస్వామి సన్మాన సభ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… విద్యారంగానికి వెంకటస్వామి చేసిన సేవలు గొప్పవని అన్నారు. తన 27 ఏళ్ల పదవీకాలంలో పిల్లల అభివృద్ధి కోసం ఆయన తపి oచాడని అన్నారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దంపతులను పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, అతిథులు, బంధువులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్, డిటిఎఫ్ నాయకులు వేల్పుల రత్నం, సొల్లు బాబు, బిక్షపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





