Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్లో గత వారం నిర్వహించిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన హౌస్ క్యాప్టెన్లు, వైస్ క్యాప్టెన్లకు శనివారం బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణుమాధవ్ చేతుల మీదుగా విజేతలకు బ్యాడ్జీలు, సాష్‌లు, టైటిల్స్ ప్రదానం చేశారు.

అనంతరం విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాలలో క్రమశిక్షణను కాపాడుతూ, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ బాధ్యతలను అలవర్చుకోవడం భవిష్యత్‌కు దోహదపడుతుందని కరస్పాండెంట్ వేణుమాధవ్ అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నూతన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు.





