
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను హుజురాబాద్‌లోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో బోనాలను తయారు చేసి పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


విద్యార్థులు పోతురాజుల వేషధారణలో చేసిన నృత్యాలు, ఆటపాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.


ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని, మన పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించే పండుగే బోనాలని తెలిపారు.


అలరించిన బోనాల వేడుకలు దృశ్యాలు..
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దాసరి తిరుపతి యాదవ్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.





