
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు చేనేత సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమ ప్రాముఖ్యత, కార్మికుల గురించి పలువురు వివరించారు. చేనేతను కాపాడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు బి సదానందం, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, ఇందిరా మార్గ్ హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





