
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘమును శుక్రవారం హుజురాబాద్ మండలం కందుగుల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు సందర్శించారు.
జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు చేనేత సంఘం సందర్శించి చేనేత వస్త్రాల తయారీ గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాల వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని అవగతం చేసుకున్నారు. చేనేత కార్మికుల జీవన విధానం వారి పనితీరు మొదలైన అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్కిరెడ్డి ఆగన్న, గుల్ల సమ్మయ్యా ఓరుగంటి తిరుపతి, మమత, విజయలక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.



చేనేత కార్మికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న విద్యార్థులు..

చేనేత సంఘాన్ని సందర్శించిన కందుగుల విద్యార్థులు
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, ఇందిరా మార్గ్ హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





