
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:చేనేత దినోత్సవం సందర్భంగా
బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ దేవ సాని ప్రియదర్శిని ఆధ్వర్యంలో బోర్నపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ వార్డు కార్యాలయంలో మహిళ చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ
చేనేత దినోత్సవం సందర్భంగా దేవసాని ప్రియదర్శిని మహిళా చేనేత కార్మికులను సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలను మరెన్నో చేపట్టి మంచి పేరును తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలకు చేనేత హస్తకళ నిలువుటద్దానికి నిదర్శనమే కాకుండా సమాజంలోని అన్ని వృత్తుల కన్నా ఈ వృత్తి కార్మికులకు ఉన్నతమైన స్థానం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంతటి గొప్ప పేరున్న చేనేత హస్త కళా కార్మికులు ఈ నాటికి కూడా కూడు గుడ్డ గూడ నీడకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండడం పట్ల తమ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్పొరేషన్ ద్వారా ఒక ప్రత్యేక ప్యాకేజీ రూపంలో చేనేత కార్మికులకు నేతన్న హస్తం భీమా సౌకర్యంతో పాటు దారిద్ర జీవితాన్ని అనుభవిస్తున్న చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకొని వివిధ సంక్షేమ పథకాల రూపంలో అర్హులైన చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మిక నాయకులు చేయి చేయి కలిపి ఐకమత్యంతో ముందుకు కదలి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల పోరాడవలసిన అవసరం ఉందని చేనేత నాయకులకు సూచించారు.


ఈ చేనేత దినోత్సవం సందర్భంగా బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలకమారి శ్రీనివాస్, సంగం సత్యనారాయణ, ఇప్పకాయల సాగర్, మంద బిక్షపతి, కొలిపాక క్రాంతి, సృజన, బింగి రాణిలు పాల్గొని బోర్నపల్లి గ్రామస్తులైన చేనేత మహిళ కార్మికులు రమాదేవి, శారద, లలిత, సరోజన, శశికళ, వసంత, లక్ష్మి, శ్రీలత, రాజమణి, రమాదేవి, అరుణ, వాణి, లక్ష్మి, వరలక్ష్మి లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్ ఇందిరా మార్గ్ హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





