
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం హుజురాబాద్ డివిజన్లో ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యాసంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందమైన తోరణాలు కట్టి ఆవరణలో ముగ్గురు వేశారు. పట్టణంలోని పలు విద్యాసంస్థలు తమ పిల్లలతో పట్టణంలోని వీధులలో ఉన్న దేశ నాయకుల వేషధారులతో ప్రభాతభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో పతాకావిష్కరణ అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. హుజురాబాద్ పట్టణంలోని కేసి క్యాంపులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ నాయక్ వాడి జల కుమారి, ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ వాసంశెట్టి మాధవి, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్, మోటార్ వెహికల్ కార్యాలయంలో కంచి వేణు, రూరల్ కార్యాలయంలో రూరల్ సీఐ వీరభత్తినీ శ్రీనివాస్, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ మరాఠీ సుగుణ, న్యాయస్థానంలో న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ జక్కని నరేందర్, సర్కిల్ కార్యాలయంలో టౌన్ సిఐ కరుణాకర్, ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాస్, మునిసిపాలిటీలో చైర్పర్సన్ రోoటాల సుహాసిని, ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్, సూపరిండెంట్ డాక్టర్ రవీందర్, డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఇందిరాదేవి జూనియర్ కళాశాలలో సుగుణ, కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఇంత్యాజ్ అలీ, ఆర్టీసీ డిపోలో డిఎం రవీంద్రనాథ్ ,పలు విద్యాసంస్థల్లో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు, కార్మిక సంఘాల, కుల సంఘాల కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆయా సంఘాల అధ్యక్షులు ఎగురవేశారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జెండాకు సెల్యూట్ చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు.


మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరించి సెలెక్ట్ చేస్తున్న చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ కిషన్, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది


లారీ అసోసియేషన్ వద్ద…

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద..

రాజపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్ మల్లారెడ్డి..

డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద జెండా ఆవిష్కరిస్తున్న అధ్యక్షుడు రాజు, పాల్గొన్న బిజెపి నాయకులు..

హుజురాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు…

కొత్తపల్లి ఇందిరానగర్ వద్ద అంగన్వాడి సెంటర్ లో జెండా ఆవిష్కరిస్తున్న కౌన్సిలర్ రవీందర్రావు..
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





