
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల గురించి సమాచారం అందడంతో సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని తిరుమల ఇండస్ట్రీస్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 3 00 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను అధికారులు స్వాధీనం చేసుకొని , ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఐదుగురుపై అధికారులు కేసు నమోదు చేశారు.

వివరాలలోకి వెళితే…హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని తిరుమల ఇండస్ట్రీస్‌లో ఆదివారం సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లులో సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. మరో రెండు ట్రాలీ ఆటోలో బియ్యం రావటంతోనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్లను అదుపులోకి, తీసుకున్నారు. కాగా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఉప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రేషన్ దుకాణంలో నుంచి కొంత సేకరించినట్లు తెలిసింది. మిల్లులో ఉన్న బియ్యం నిల్వలను తూకం వెస్తున్నారు. సుమారు 300 క్వింటాళ్ల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మిల్లు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సివిల్ సప్లై శాఖ అధికారులు పేర్కొన్నారు. మిల్లును సైతం సీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.





––ఐదుగురిపై కేసు నమోదు
రేషన్ బియ్యం వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యాపారస్తుడు శీల శ్రీనివాస్, తిరుపతి సురేష్, అంగిడి తిరుపతి, రేషన్ డీ డి వినోద, మిల్లు యజమాని ఉపేందర్ల పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో తిమ్మాపూర్ డీటీసీఎస్ విజయ్ కుమార్, హుజురాబాద్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు వినోద్ కుమార్, తిమ్మాపూర్ ఎండి అన్వరుల్లాఖాన్, హైదరాబాదు టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.





