
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల, వ్యాపారస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని హుజూరాబాద్ ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో కార్గో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలు నమ్మకమైనవని, ఖచ్చితమైన వని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో సీఐ అంజలి, కార్గో నిర్వాహకులు గూటం ప్రశాంత్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.





