
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వానాకాలం 2026 పంటల నమోదు ప్రక్రియ ఈ సీజన్ పూర్తిస్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేయడం జరుగుతుందనీ హుజురాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు(R) జీ సునిత పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్ని నియమించటం జరిగిందన్నారు. వారు తప్పకుండా సర్వే నంబర్ వారీగా క్షేత్ర సందర్శన చేసి పంట ఫోటో చిత్రీకరించి వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలు ఆధారంగా పంట కొనుగోలు ప్రక్రియ ఈసారి చేయడం జరుగుతుందన్నారు. కావున పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలు పండిస్తున్న రైతులు తమ గ్రామాలలో జరుగుతున్న డిజిటల్ క్రాఫ్ట్ సర్వే వాలంటీర్లకు తమ వివరాలను అందజేయగలరని, ఈ డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ ఈనెల 30 తేదీ వరకు ముగుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 7 వరి సన్న రకాలు పండిస్తున్న రైతులు రూ. 500 బోనస్ కొరకు దరఖాస్తులు:
వానాకాలం 2026 సీజన్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన 7 వరి సన్నరకాలను పండిస్తున్న రైతులు 500రూ. బోనస్ కొరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోగలరనీ కోరారు. ప్రైవేట్ విత్తన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆయా డీలర్ల వద్దనే ఆన్లైన్ లో నమోదు చేసుకోగలరనీ తెలిపారు. స్వంత ఇంటి వడ్లు లేదా సీడ్ మిల్లులు, యూనివర్సిటీ వద్ద విత్తనాలు తీసుకున్న రైతులు రైతు స్వీయ ధ్రువీకరణ పత్రాలు నింపి సంబంధిత ఏఈఓ వద్ద ఆన్లైన్ లో నమోదు చేసుకోగలరన్నారు .ఆన్లైన్ లో నమోదు చేసుకోని రైతులకు బోనస్ వర్తించదు కాబట్టి రైతులు చివరి తేదీ 10-09-2026 లోపు తమ వివరాలు నమోదు చేసుకోగలరనీ ఆమె తెలిపారు.

## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





