
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సూపర్‌బజార్ చౌరస్తాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సందడి చేశారు.


కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే వేడుకలో ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉట్టి కొడుతున్న చిన్నారులపై రంగుల నీళ్లు చల్లుతూ, చప్పట్లతో వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం స్వయంగా చిన్నారులతో కలిసి ఉట్టిలోని పుట్టిని పగులగొట్టి సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఉట్టి కొట్టిన చిన్నారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
హుజూరాబాద్ :
హుజూరాబాద్ పట్టణంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వారు, కొబ్బరికాయ కొట్టి ఉట్టి కొట్టే (ఉట్లోత్సవం) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టే దృశ్యాలు ఆకట్టుకున్నాయి.



అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజంలో ఐక్యత, సంతోషాలను నింపేందుకు ఇటువంటి పండుగలు తోడ్పడతాయని తెలిపారు. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





