
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినందుకు నిరసనగా ఆదివారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్మికులు, తాడుతో ఆటోను లాగుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆటో కార్మికులకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనప్పటికీ ఆ మాట మరిచిపోయారని అన్నారు. ఉచిత బస్సు ఫలితంగా ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని అన్నారు. ఆటో కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా గడుపుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్రావు, గందె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముత్యం రాజు, ముక్క రమేష్,పాల కిషన్, మక్కపల్లి కుమారస్వామి,నాయకులు చందా గాంధీ పంజాల శ్రీధర్, విడపు అనురాగం, రమేష్, జీకే ప్రభాకర్, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-కందుగులలో…..
హుజురాబాద్ మండలం కందుగు ల గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మండ సతీష్ గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీ, అలాగే గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్ గ్యారంటీలు అమలుపరచి గ్రామపంచాయతీల పాలన గాడిన పట్టేలా అవసరమైన నిధులు కేటాయించాలని అన్నారు. ఈ ర్యాలీలో గ్రామ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బెల్లి రవి, మాజీ ఎంపిటిసి కాసo పద్మ రఘుపతిరెడ్డి, వార్డు సభ్యులు గోలి అరణ్యవిజయకుమార్, మండ కవిత శ్రీనివాస్, తలకొక్కుల బిక్షపతి, ఎలగందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మండ సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ కందుగుల, ఉప సర్పంచ్ ల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడు హుజురాబాద్.





