
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచన మేరకు… హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ మండ సతీష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీ, అలాగే గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు.

దీనికి నిరసనగా ఈ రోజు కందుగుల గ్రామంలో ఆటోలతో ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్ గ్యారంటీలు అమలుపరచి గ్రామపంచాయతీల పాలన గాడిన పట్టేలా అవసరమైన నిధులు కేటాయించాలని సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ ర్యాలీలో గ్రామ ఉప సర్పంచ్ మండ సతీష్, గ్రామ సీనియర్ నాయకులు బెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బెల్లి రవి, మాజీ ఎంపిటిసి కాసo పద్మ రఘుపతిరెడ్డి మరియు వార్డు సభ్యులు గోలి అరణ్యవిజయకుమార్, మండ కవిత శ్రీనివాస్, తలకొక్కుల బిక్షపతి, ఎలగందుల రమేశ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మండ సతీష్ గౌడ్, ఉప సర్పంచ్ కందుగుల, ఉప సర్పంచ్ ల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడు హుజురాబాద్.





