
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని , వాటిని విద్యార్థులు సమానంగా తీసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్జిఎఫ్ మండలస్థాయి అండర్ 14 , అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు.

క్రీడా జెండా ఎత్తి క్రీడలను ప్రారంభిస్తున్న చైర్ పర్సన్ సుహాసిని


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.…క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచుతాయని, కెరటాలను స్ఫూర్తిగా తీసుకొని పడిపోయినప్పటికీ లేచే ప్రయత్నం చేయాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని క్రీడల్లో రాణించి ప్రభుత్వము అందించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హుజురాబాద్ మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులందరూ మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. ఎంతోమంది క్రీడాకారులు గ్రామీణ క్రీడలనుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, కోయల్ కార్ భారతి, చందమల్ల పుణ్య, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి చిరుత శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు శోభారాణి, బి.తిరుమల, మ్యాకల తిరుపతి, సొల్లు బాబు, టిజీ పేట గౌరవ అధ్యక్షులు సొల్లు సారయ్య, రిటైర్డ్ పిడి వెంకట్ రెడ్డి, కే రాజిరెడ్డి, హాకీ ఆసోసియేషన్ కార్యదర్శి బోడిగ తిరుపతి, పీడీ, పీఈటీలు కే రేణుక, దూడ సత్యనందం, పి రాజు, భాగ్యలక్ష్మి, కవిత, ఎస్ అనిల్, సాయి, వెంకటేష్ తదితరు పాల్గొన్నారు.





