Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని విగ్రహాల ఆగమన సమాయంలో డీజేల ఏర్పాటు, అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్స్ మరియు బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించినట్లు హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు:
- శాంతియుత వేడుకలు: గణేష్ విగ్రహాల ఆగమన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతియుతంగా నిర్వహించుకోవాలి.
- ముందస్తు అనుమతులు తప్పనిసరి: నిబంధనలకు విరుద్ధంగా, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి డీజేలు, ఊరేగింపులు, ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
- శాంతిభద్రతల పరిరక్షణ: వేడుకల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంటప నిర్వహకులు, ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలి.





