Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్ఎండి దిగువ ఆయకట్టు కింద సాగు చేసిన రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే సాగునీరు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా ఆత్మ డైరెక్టర్ వంగల వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు కింద సుమారు రూ.25 వేల నుంచి 30 వేలు ఎకరాకు ఖర్చు చేసి రైతులు పంటలు సాగు చేశారని ఆయన తెలిపారు. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావుల్లో నీళ్లు లేక పంటలు చివరి పొట్ట దశలో ఉండి సాగునీరు కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. లోయర్ మానేరు డ్యాం ద్వారా రెండు వారాలపాటు సాగునీరు విడుదల చేస్తే రైతులకు పంటలు చేతికి వచ్చి గట్టెక్కే పరిస్థితి ఉందని, ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని నీటిని విడుదల చేయాలని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

పెద్ద మనసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబులు కలగజేసుకుని నీటి విడుదలకు కృషి చేయాలని రైతుల పక్షాన వంగల వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.




