Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కందుకూరి శంకర్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్మార్ట్ ఇండియా 2026 కార్యక్రమంలో భాగంగా కళాశాల అంతర్గత ప్రారంభ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము వివిధ మంత్రిత్వ శాఖల శాఖలకు చెందిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు సలహాలు సూచనలను విద్యార్థుల నుండి సేకరిస్తారన్నారు. విద్యార్థులు చెప్పిన పరిష్కారాలతో ప్రాజెక్టులు చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఈ సందర్భముగా ఈరోజు కళాశాల స్థాయిలో జరిగిన అంతర్గత పోటీలలో దాదాపు 35 బృందాలు పాల్గొన్నట్లు చెప్పారు. వీటికి పోటీ పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కళాశాల వారు పంపిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఇందులో నుండి ఉత్తమ పరిష్కారాలను ఎన్నుకొంటారని చెప్పారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ప్రదీప్ వ్యవహరించారు. ఈ పోటీలకు న్యాయనిర్నేతలుగా అధ్యాపకులు డాక్టర్ ఎన్.రఘు, డాక్టర్ డి.ప్రశాంత్, డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్, ఈ.స్వప్న, దివ్యరాణి లు వ్యవహరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





