
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ సమితి అధ్యక్షులుగా పట్టణానికి చెందిన ఈదులకంటి రవీందర్ రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సేవ ప్రముఖ కోమళ్ళా రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ రాధాకృష్ణారెడ్డి తెలిపారు.


ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉత్సవ సమితి అధ్యక్షుడిగా నియమించిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శ్యామ్, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొమురవెల్లి రాజు, పట్టణ కార్యదర్శి కనకం శ్రీనివాస్, నాయకులు గుంటి శ్రీనివాస్, కందుల శ్రీనివాస్ రెడ్డి, అంగీరక ప్రసాద్, కుసుంబ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.





