
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లోని 4 పోలింగ్ బూతులను స్పెషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా శనివారం హుజరాబాద్ ఆర్డిఓ నాయక్ వాడి జల కుమారి సందర్శించి పరిశీలించారు. ఎస్ ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు నోటీసులు ఇస్తున్న క్రమంలో బిఎల్వోలు ఇతర అధికారుల పనితీరులను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు ఓటర్లకు అందుతున్న క్రమము, వారు వచ్చి సమాధానం ఇస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట హుజురాబాద్ ఎన్నికల డిటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: హుజురాబాద్ పురపాలక సంఘం సానిటరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది.





