
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని వీణవంక మండలానికి చెందిన ఎంజెపి బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం తెల్లవారుజామున ఆరవ తరగతి విద్యార్థి బొంగోని స్నితన్ (12) అదృశ్యమయ్యాడు. వీణవంక మండలం గన్ముకుల గ్రామానికి చెందిన బొంగోని శ్రీనివాస్ స్వప్న దంపతులకు కుమారుడైన స్నితన్ హుజురాబాద్ పట్టణ శివారులోని గురుకుల పాఠశాలలో ఆరవ తరగతిలో చేర్పించారు. కాగా ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు బాలుడు పాఠశాలలో లేకపోవడంతో ఉపాధ్యాయులు తండ్రి శ్రీనివాస్ కు సమాచారం అందించారు. తమ కుమారుడు కోసం ఇంటి నుండి వెతుక్కుంటూ హుజురాబాద్ పాఠశాలకు వస్తుండగా మార్గమధ్యంలో నడుచుకుంటూ వెళ్తున్న తన అబ్బాయి కనబడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్న శ్రీనివాస్ దంపతులు తమ పిల్లవాడు తప్పిపోవడానికి గురుకుల పాఠశాల సిబ్బంది కారణమని ఆరోపించారు. కాగా పాఠశాలలో చేరిన నాటి నుండి అబ్బాయి హాస్టల్లో ఉండను అని మారాం చేసేవాడని ఉపాధ్యాయులు తెలిపారు. తమ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని ప్రిన్సిపాల్ సంపత్ తెలిపారు.





