
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజరాబాద్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు హాజరై మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన మరియు రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు, యోధులు పోరాడారనీ, భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17, 1948న ‘ఆపరేషన్ పోలో’ పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసిందన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది, ప్రజలకు స్వేచ్ఛ లభించిన ఈ చారిత్రక సంఘటన జ్ఞాపకార్థం ఈ రోజును విమోచన దినంగా పాటిస్తారు అని ఆయన తెలిపారు.


రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్ మాట్లాడుతూ నిజాం సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎల్-ఎడ్రూస్ లొంగిపోయారనీ, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియో ద్వారా తన ఓటమిని, కాల్పుల విరమణను ప్రకటించి, భారత్‌లో హైదరాబాద్ విలీనాన్ని అంగీకరించారన్నారు. ఫలితంగా సెప్టెంబర్ 18న అధికారికంగా లొంగిపోవడం పూర్తయిందనీ, దీంతో నిజాం నిరంకుశ పాలన అంతమై, ప్రజలకు రజాకార్ల హింస నుంచి విముక్తి లభించిందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయిచరణ్, నగర సంయుక్త కార్యదర్శిలు కుమారస్వామి, శివ, అజయ్, భార్గవ్, నగర ఉపాధ్యక్షులు చరణ్ తేజ, రాకేష్, కృష్ణ, మనిప్రీతం,ఇతర కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ రావుల వెంకట్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (కాట్రపల్లి), హుజురాబాద్.





