
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ (VHP) కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజరాబాద్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో విహెచ్పి రాష్ట్ర సేవా ప్రముఖ్ కోమల్ల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోరక్ష సంపర్క్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పల శ్యామ్ పాల్గొని మాట్లాడారు. హుజరాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో వీహెచ్‌పీ కమిటీలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హిందువులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, దేశవాళీ ఆవుల సంరక్షణ, వాటి ద్వారా లభించే ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.


నూతన మండల కమిటీ వివరాలు:
అధ్యక్షుడు: కంకణాల రమేష్ రెడ్డి
ఉపాధ్యక్షుడు: గీసుకొండ కిషన్
కార్యదర్శి: భాషాబోయిన చంద్రయ్య
గోరక్ష ప్రముఖ్: రావుల సురేష్
ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా గోరక్ష ప్రముఖ్ రావుల అనిల్, పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు, కార్యదర్శి కనకం శ్రీనివాస్‌తో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నేరెళ్ల మహేందర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ (డిసిసి) అధికార ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్).





