Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం (19-09-2026) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఏఈ (AE) ఎమ్. శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
లైన్ మరమ్మత్తుల కారణముగా పాత మార్కెట్, సూపర్ బజార్, లలితా కిరాణం మరియు సాయిబాబా టెంపుల్ ఏరియాలలో కరెంట్ కోత ఉంటుందని వెల్లడించారు. ఈ సమయానికి సంబంధించి వినియోగదారులు, ప్రజలు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.





