
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని దమ్మక్కపేట కు చెందిన ఆశా కార్యకర్త గుండెల్లి శ్రీలత (40) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల తెలిపారు . ఆమె చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధమ్మక పేట కేసి క్యాంప్ ప్రాంతంలో 2005 సంవత్సరం విధుల్లో చేరి, మాతా శిశు సంరక్షణ సేవలు , కరోనా వంటి మహమ్మారి ప్రబలినప్పుడు మొదటి, రెండోవ విడతలో శ్రీలత ఎనలేని సేవలందించింది.
వందల సంఖ్యలో పేద, మధ్య తరగతి అన్ని వర్గాల గర్భిణీలకు బాలింతలకు సేవలందించింది. ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రసవాలు చేయించి మంచి పేరు తెచ్చుకున్నట్లు సహ ఉద్యోగులు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఆశా వర్కర్ గా సేవలందించిన
శ్రీలత అకాల మరణం వైద్య ఆరోగ్యశాఖకు తీరనిలోటు అని ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు తాడూరి లత, మదీనా, అరుణ పుష్ప, శశికళ, సరిత, తిరుమల, సమ్మక్క హాజరై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.





