
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పిడుగు పడి తాటి చెట్టు స్వల్పంగా దెబ్బతింది.
వర్షం లేకుండానే ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో ఈ ఘటన జరిగింది. తాటి చెట్టుపై పిడుగు పడి మధ్య భాగంలో కాలిపోయి స్వల్పంగా మాడిపోయింది.
ఇది గీతా కార్మికులకు జీవనోపాధి అయిన తాటి చెట్టు. ఒకవేళ పిడుగు పడే సమయంలో గీతా కార్మికుడు చెట్టుపై ఉన్నట్లయితే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.




