
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో బిసి అజాధి-ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ పెద్ద కుమారుడు హన్మకొండ ఎర్రగట్టు గుట్ట వద్ద గల MSR గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకలో ప్రముఖులు పంజాల తిరుపతి గౌడ్– నాగమణిల కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చందు – స్నేహలను పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈరోజు శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట, చెల్పూర్ ప్రాంతాలకు చెందిన ప్రముఖులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






