
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ మరియు మండలంలోని వైన్స్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములను విస్తరించి బార్లను తలపించే విదంగా పెద్ద పెద్ద షెడ్లు షెట్టర్లలో కిచన్లు ఏర్పరచి నాసిరకపు ఆహార పథార్దాలు మాంసహారాలు తయారుచేసి అధిక ధరలకు విక్రహిస్తు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వైన్స్ లపై, పర్మిట్ రూముల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఆబ్కారీ సిఐ కి పిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండ వైన్స్ షాపుల అక్రమ పర్మిట్ రూముల నిర్వాహకులకు పరోక్షంగా సహకరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జవాబు దారి తననాన్ని విస్మరిస్తున్న అబ్కారీ సిఐ పై ఆ శాఖ జిల్లా సూపరింటిడెంట్ అధికారీకి రిజిస్టర్ పోస్టు ద్వారా పిర్యాదు చేసినట్లు ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య తెలిపారు.

ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలోని వరంగల్, కరీంనగర్ రహదారిలోని వైన్స్ లు అలాగే జమ్మికుంట రోడ్డులోని వైన్స్ లే కాక చెల్పూర్ గ్రామంలోని జమ్మికుంట రోడ్డులోని వైన్స్ లు మెయిన్ రోడ్డులలో ఉండడం వల్ల వారు ఏర్పాటు చేసిన పర్మిట్ రూములచెప్పే అక్రమ బార్ల ముందు గంటల తరబడి వాహనాలు నిలపడం వల్ల ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గతంలో ఇప్పటి దుర్గ వైన్స్ ముందు ఆక్సిడెంట్ లో ఒకరి ప్రాణం కూడ పోయిందని సమ్మయ్య గుర్తు చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి పర్మిట్ రూములను నడుపుతున్న వైన్స్ షాపుల నిర్వహకులపై అలాగే ఫిర్యాదులు ఇచ్చిన కూడ పట్టించుకోని హుజురాబాద్ ఆబ్కారీ సిఐ పై జిల్లా అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సమ్మయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైన్స్ షాపుల యజమానులు చేస్తున్న అక్రమ దందాలపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యాన్ని నీరసిస్తూ ఆబ్కారీ శాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).




