Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి
హైదరాబాద్, నవంబర్ 23:
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గ్రూప్–1 కులాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అందులో ప్రధాన సామాజిక వర్గమైన బేడ (బుడగ) జంగాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించాలని సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిరిపాటి వేణు మాట్లాడుతూ.. ఎస్సీ గ్రూప్–1లోని కులాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయని, వీరి అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అత్యవసరమని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన ఆయా వర్గాలకు నేరుగా అందుతాయని వివరించారు.
అలాగే, బేడ (బుడగ) జంగాల సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశం కల్పించే దిశగా కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. తమ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బేడ (బుడగ) జంగం జన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).



