
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుకు ఆదివారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో బిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ నుండి హన్మకొండ లో జరిగే సభకు కేటీఆర్ వెళుతుండగా హుజురాబాద్ పట్టణ శివాలోని కేసి క్యాంపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కేటీఆర్ వాహనం ను గులాబీ నేతలు ఆపి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ నేతలతో కొంతసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, గందే శ్రీనివాస్ శ్రీనివాస్, రవీందర్ రావు, బండ నరేష్, బండ సింధు, తిరుమల్‌రెడ్డి, సర్పంచులు, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.




