
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద గల శ్రీ పాటిమీద ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గందె శ్రీనివాస్ అన్నారు.
పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై వ్రతాలలో పాలుపంచుకొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. వ్రతానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9391239094, 9393516162 నంబర్లను సంప్రదించాలని కోరారు.



