
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్బంగా ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో రోగులకు పండ్ల, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందించారు. రాత్రి రోడ్ మీద వుండే వాళ్ళకి బెడ్ షీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు కే సదానందం, ఓం నమశ్శివాయ, ఏ శ్రావణ్ కుమార్, అంబరీష్, వెంకటేశ్వర్లు, నిరంజన్, కృష్ణ, అనసూయ, పద్మ, షర్మిల, రాము, విక్రం తదితరులు పాల్గొన్నారు.




