
—ఎమ్మేల్యే తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..
—సంక్షేమ పథకాలపై బిఆర్ఎస్ తన అక్కసును వెళ్లగక్కుతుందని ప్రణవ్ ఆగ్రహం.
— చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా కౌశిక్ రెడ్డి??
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదలకు అందించే సంక్షేమ పథకాలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్రంగా ఖండించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గానికి కొత్తగా 4,221 పెన్షన్ మంజూరు చేశామని అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి సొంత గ్రామం వీణవంకలో 28 కొత్త పెన్షన్ లు ఇచ్చామని లబ్ధిదారుల సమక్షంలో ఆధారాలతో బయటపెట్టారు. కౌశిక్ రెడ్డి మాట్లాడేవాన్ని బట్టేబాజ్ ముచ్చట్లే అని, నియోజకవర్గ వ్యాప్తంగా వితంతులకు 1980, వికలాంగులు 1133, గీత కార్మికులకు 553, చేనేత కార్మికులకు 145, ఒంటరి మహిళలకు 311 పెన్షన్ లను అందజేశామని తెలిపారు. స్వయంగా కౌశిక్ రెడ్డి ఎమ్మేల్యే పదవిలో ఉండి ఇవి పంచాడని ఇప్పుడు సిగ్గు లేకుండా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

—బిఆర్ఎస్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి మాటలు విని బుద్ధి తెచ్చుకో కౌశిక్ రెడ్డి..
మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి 6 వేల కొత్త పెన్షన్ మంజూరు అయ్యాయని వాటిని మీడియా ముఖంగా వెల్లడించారని ఆ వీడియో మీడియా ప్రతినిధులకు చూపించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అవగాహన రాహిత్యంగా మాట్లాడడం హుజురాబాద్ నియోజవర్గానికి పట్టిన శని అని,హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు హుజురాబాద్ కు పట్టిన శని ఎప్పుడు వదులుతుందా అని ఆలోచించుకుంటున్నారని అన్నారు.

—ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్నాం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్నామని, స్వయంగా కౌశిక్ రెడ్డి వీణవంక మండలంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహ ప్రవేశానికి హాజరయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజలకు అందుతుంటే బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రైతులకి రుణమాఫీ విషయంలో నియోజవర్గవ్యాప్తంగా 33,158 మంది రైతులకు 248.5 కోట్ల నిధులతో రుణమాఫీ జరిగింది అని అన్నారు. ధరల పెరుగుదల విషయంలో రేట్లు ఎవరు పెంచుతారో తెలివిలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి అని గ్యాస్, గుడ్డు ధరలు ఎవరు పెంచుతారో తెలియని తెలివిలేని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని అన్నారు.

రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు..
కింది స్థాయి నుండి స్వయం కృషితో ఎదిగి, జడ్పీటీసీ స్థాయి నుండి, ఎమ్మేల్యేగా ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, తనతో పోల్చుకునే స్థాయి బిఆర్ఎస్ నాయకులకు లేదని, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పులి కాదని అన్నారు. 2009లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనీ, కొడంగల్ ప్రాంతానికి ఐటీఐ కాలేజీ, కోస్గి బస్ డిపో లాంటి అనేక అభివృద్ధి పనులు చేశారనీ, సిరిసిల్ల ప్రాంతానికి చిన్నబాస్ కేటీఆర్ 2009 ఏం చేశాడో కౌశిక్ రెడ్డి చెప్పగలుగుతాడా అని ప్రశ్నించారు.

అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి,రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి,వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రణవ్ డిమాండ్..
పెన్షన్ ల విషయంలో ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన కౌశిక్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని,ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.




