
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్, నవంబర్ 22: హుజూరాబాద్ రూరల్ మండల పరిధిలోని 33/11 కేవీ సింగపూర్ సబ్ స్టేషన్లో నెలవారీ మరమ్మతు పనుల కారణంగా సోమవారం (23.11.2026) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మరమ్మతుల దృష్ట్యా మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు హుజురాబాద్ మండలంలోని సింగపూర్, మందాడిపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు హుజూరాబాద్ రూరల్ ఆపరేషన్ ఏఈ ఎస్. రమేష్ వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో కలిగే ఈ తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, వినియోగదారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించవలసిందిగా ఏఈ విజ్ఞప్తి చేశారు.




