Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎంతోకాలంగా ఆశా కార్యకర్తల అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు.
సోమవారం హుజురాబాద్ సిఐటియు మండల కార్యాలయంలో నాయకురాలు తాడూరి లతా అధ్యక్షతన ఆశా వర్కర్ యునియన్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో ఆశా వర్కర్లు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారనీ, వీరంతా బడుగు, బలహీన వర్గాలకు, గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కీలకంగా పని చేస్తున్నారనీ అన్నారు. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంను చూపడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని అన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెట్టి సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం నాయకురాలు విమల, శారద, అన్నపూర్ణ, సునీత స్వప్న తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).




